వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లే పంచాయతీలో సోమవారం సాయంత్రం సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఎంపీపీ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని వరసిద్ది వినాయక నగర్, సోమవారిపల్లె గ్రామంలో ఆయన గడప గడపకు తిరిగి స్థానికంగా పంచాయతీలో గల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడి స్టాక్ వివరాలు పరిశీలించారు.
అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్ని తమకు సకాలంలో అందాయని ప్రజలు చెప్పడంతో ఆయన ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేసి చూపెట్టే ప్రభుత్వమని చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి మభ్య పెట్టమని అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ డ్వాక్రా మహిళకు రుణాల అందజేస్తామని, ఎలక్షన్లు దగ్గరకు వచ్చిన టైంలో మాత్రమే వారికి ఆశ చూపారని, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏమాత్రం చేయలేదని ఇంటికి ఒక ఉద్యోగం పంపిస్తానని ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు సచ్చింది లేదని మండిపడ్డారు. మా నాయకుడు అలా మాటలు చెప్పి చేయకుండా ఉండే ముఖ్యమంత్రి కాదని, నవరత్నాల మేనిఫెస్టోలో ఏవైతే అమలు చేస్తానని చెప్పాడు ప్రతి ఒక్కటి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని, తాను ఎంతో గౌరవంగా చెప్తున్నానని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి. శ్రీకృష్ణాలయ చైర్మన్ చల్లా రాజగోపాల్ యాదవ్. వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి. వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి. మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు భూమి రెడ్డి వంశీదర్ రెడ్డి, కమాల్ భాష, వైసిపి నాయకులు ఆచారి కాలనీ శివారెడ్డి. రాయపురెడ్డి, రాగా నరసింహులు, మల్లికార్జున యాదవ్, కొండయ్య, రజక సంఘం నాయకులు పన్నీటి కాసయ్య, గజ్జాల కళావతి, పద్మావతి, సచివాలయం సిబ్బంది, కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comentarios