అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
సోములవారిపల్లె, ఈశ్వర్ రెడ్డి నగర్లో "గడప గడపకు - మన ప్రభుత్వం కార్యక్రమం" నిర్వహించిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వర్ రెడ్డి నగర్లో సోమవారం సాయంత్రం "గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం" లో భాగంగా శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పనితీరును వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు, పేదలకు తోడుండాలనే మంచి మనసున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని - ఏ కారణం చేతనైనా ఎవరికైనా సంక్షేమ పథకం అందకపోతే, మరలా తిరిగి దరఖాస్తు చేసుకుంటే, నిర్దిష్ట సమయ వ్యవధిలో ఆ దరఖాస్తులు పరిశీలించి వారికి లబ్ధి చేకూరేలా పని చేసే ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల ఇళ్ల ముందుకి పరిపాలన తెచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. అనంతరం రెండవ సచివాలయ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి తల్లులకు, పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఉప సర్పంచ్ రామకృష్ణ రెడ్డి, ఎంపీటీసీ పల్లా లక్ష్మిదేవి ఎంపీటీసీ గూటూరు వెంకటేష్, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజిని, పలువు మునిసిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రజలు పాల్గొన్నారు.
Comments