వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పి ఫ్యాషన్ పై మొగ్గు చూపుతూ సంస్కృతి సాంప్రదాయాలు అభిమానం ప్రేమ ఆప్యాయతలతో నిండి ఉన్నదే కడప జిల్లా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పునరుద్ఘాటించారు. పొద్దుటూరు లోని కొంతమంది యువకులు ఆర్ఆర్ గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రొద్దుటూరు సంస్కృతి సాంప్రదాయాలు ప్రజల ఆహారపు అలవాట్లు తీపి జ్ఞాపకాలతో కూడిన పాటను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కడప బాంబుల గడ్డగా, రాక్షసులుగా, ఫ్యాక్షలిస్టులుగా, అనాగరికలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. కడప జిల్లాలో ఎంతోమంది మహానుభావులు జన్మించారని ఆయన గుర్తు చేశారు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అల్లసాని పెద్దన, మొల్ల, అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు తదితర మహాకవులు జన్మించిన గడ్డగా ఆయన చెప్పుకొచ్చారు. సాక్షాత్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కీర్తనలను అన్నమయ్య ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. కడప జిల్లా ప్రజలలో ఎంతో ఆప్యాయత ప్రేమ అభిమానం దాగి ఉందని దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు, ఇంటికి వచ్చిన అతిధికి అన్నం పెట్టందే బయటికి పంపని గుణం ప్రజలలో ఉందన్నారు. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు చరిత్ర కలిగిన కడప జిల్లాను కించపరుస్తూ మాట్లాడితే ఇకనుంచి సహించేది లేదని హెచ్చరించారు.
ఎక్కడైనా కడప సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడితే క్షమించకూడదని పిలుపునిచ్చారు. పుట్టిన ఊరు పెరిగిన ప్రాంతం పై ఎంతో ప్రేమ ఆప్యాయత ఉంటుందన్నారు, తను పుట్టిన ఊరు ప్రొద్దుటూరు ప్రజల ఆహారపు అలవాట్లు గత జ్ఞాపకాలు సంస్కృతి సాంప్రదాయాల గురించి రాసిన నాగేంద్ర గోపు సాహిత్యాన్ని ఆయన అభినందించారు పాట పాడిన తీరు అద్భుతంగా ఉందన్నారు. భవిష్యత్తులో యువకులు ఈ రంగంలో రాణించాలని ఆయన ఆకర్షించారు పాట పాడి నటించిన యశ్వంత్ నాగ్, దర్శకుడు సుదర్శన్ దర్శన్, సంగీతం అరుణ్ చింతామణి, ఎడిటర్ పృధ్వి రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి జింకా సుబ్రమణ్యం, సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పర మురళి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments