కడపజిల్లా, చిట్వేలి రెవెన్యూ కార్యాలయం నందు...ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు. ప్రధానంగా భూ సమస్యలు లు అధికంగా వెల్లువెత్తాయి. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు భూ సమస్యలతో ఎమ్మెల్యేకు అర్జీలు విన్నవించారు. దీనికి ఎమ్మెల్యే కొరముట్ల స్పందిస్తూ రైల్వే కోడూరు నియోజకవర్గం లో అత్యధికంగా చిట్వేలు మండలం లోని భూ సమస్యలు ఉన్నాయని ఇందులో ప్రధానంగా కుటుంబ సభ్యుల నుంచి ఆస్తులు సంభవించినప్పటికీ వాటికి సంబంధించి లింకు డాక్యుమెంట్లు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల కు,భూ మార్పిడి ఆన్లైన్ విధానాలకు మరింత జాప్యం జరుగుతుందని, దీని పూర్వపలాలు సంబంధిత అధికారులు పరిశీలించి సత్వరమే అందరికీ తగు న్యాయం చేయాలని సూచించారు. విద్యార్థులకు వారికి కావలసిన కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాలను ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలని అన్నారు. కాగా పల్లె కాపులు గా పేర్కొనే వారిని బి సి లు గా చర్చి సంబంధిత ధ్రువపత్రాలను ఇవ్వాలని మరియు మండల వ్యాప్తంగా వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. వికలాంగుల సమస్యలను ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, లింగం లక్ష్మి కర్, ప్రదీప్ రెడ్డి, మండల ఎంపిపి చంద్ర , ఉప ఎంపిపి సుబ్రమణ్య రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అరిఫ్, మండల రెవెన్యూ అధికారి జీవన్ చంద్రశేఖర్, మండల అభివృద్ధి అధికారి సమతా, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు,పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, వామపక్ష నాయకులు,వికలాంగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments