top of page
Writer's picturePRASANNA ANDHRA

నేడు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల సమాచారం :

నేడు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

నకిలీ‌ వెబ్సైట్ నమ్మి‌ మోస పోవద్దు..

శ్రీవారి భక్తుల సౌఖర్యార్ధం టిటిడి ఏప్రిల్ 25వ తారీఖున మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఆన్లైన్ లో విడదల చేయనుంది.. ఇందు కోసం టిటిడి అధికారిక వెబ్ సైట్‌లోనే బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్ లను నమ్మి మోస పోవద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది అసలు ఏ ఏ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ కోటాను టిటిడి విడుదల చేస్తుందంటే..??

కలియుగంలో భక్తులను రక్షించేందుకు వైకుంఠంను వదిలి భూవికి దిగి వచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్ధం ప్రతి నిత్యం దేశ విదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తిరుమల పుణ్యక్షేత్రంను సందర్శిస్తూ ఉంటారు.. అయితే భక్తులకు ఎటువంటి అసౌఖర్యం కలుగకుండా వివిధ రూపాల్లో శ్రీనివాసుడి దర్శన భాగ్యంను టిటిడి కల్పిస్తూ ఉంటుంది.. ఇందులో ప్రధానంగా విఐపి బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైం స్లాట్ టోకెన్లు, దివ్యదర్శనం, ఆర్జిత సేవ వంటి పద్దతుల్లో దర్శనం కల్పిస్తుంటే, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవ, సినియర్ సిటిజన్స్, ప్రత్యేక ప్రతిభావంతులు సంబంధించిన టోకెన్లను ఆన్లైన్ ద్వారా ఒక‌ నెలకు ముందే టిక్కెట్లను జారీ చేస్తుంది.. అయితే సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు, సామాన్య భక్తులు ముందస్తుగా టోకెన్లను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుని తిరుమలకు‌ వచ్చే విధంగా సులువుగా ఉండే విధంగా టిటిడి చర్యలు తీసుకుంటుంది.. అయితే ఇలా ఆన్లైన్ లో దర్శన టోకెన్లు పొందే భక్తులకు సౌఖర్యార్ధం, గదులను సైతం ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే వెసులుబాటును టిటిడి కలపిస్తుంది.. అయితే ఇటీవల అమాయకులైన భక్తులను టార్గెట్ చేసుకుని కొందరు అక్రమార్కులు తిరుమల తిరుపతి‌ దేవస్ధానం పేరుతో నకిలి వెబ్ సైట్ ను సృష్టించి భక్తులను నట్టేట ముంచేస్తున్నారు.. నకిలీ వెబ్ సైట్ లను ఆశ్రయించి మోసపోతున్న భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో పాటుగా భక్తుల నుండి అధికంగా ఫిర్యాదులు రావడంతో నకిలీ వెబ్‌సైట్ లపై ప్రత్యేక దృష్టి సారించింది..

భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్ సైట్ లను గుర్తించి వాటిపై క్రిమినల్ కేసులు పెట్టింది.. అయితే దాదాపుగా 41 నకిలీ వెబ్ సైట్‌లను గుర్తించి టిటిడి వాటి వివరాల సేకరించి, వాటిని ఆపరేటర్ చేసే వ్యక్తులను గుర్తించే పనిలో పడింది.. ఇందుకు నకిలీ వెబ్‌సైట్ వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు‌ టిటిడి పంపింది.. టిటిడి ఆన్లైన్ టిక్కెట్లు, గదుల కేటాయింపు‌ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొందరు‌ కేటుగాళ్ళు కొత్త‌కొత్త ఆలోచనలతో అమాయకులైన భక్తులను మోసగిస్తున్నారు.. ఇందుకే టిటిడి ఎప్పటికప్పుడు నకిలీ‌ వెబ్సైట్ ల పట్ల భక్తులు అప్రమత్తం చేస్తూనే ఉంది..

భక్తులు టిటిడి అధికారిక వెబ్ సైట్ లోనే టికెట్లు, గదుల కేటాయింపుల ప్రక్రియను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తుంది.. ఈ క్రమంలోనే మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది..‌టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని కోరడమైనది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని కోరుతుంది.


33 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page