వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆరోపణలు ప్రత్యారోపణలు మధ్య కొత్తపల్లె పంచాయతి వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి, ఉదయం దళిత నాయకుడు గోసా మనోహర్ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ కొనిరెడ్డి వర్గానికి చెందిన మరో దళిత నాయకుడు శ్రీపతి మనోహర్ తన అనుచర వర్గంతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి గోసా మనోహర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని తెలిపారు. ఆరోపణలలో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితువు పలికారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివాహ వేడుకలకు వస్తున్న సందర్భంలో పంచాయతీ నిధులతో హెలిపాడ్, మెటల్ రోడ్లు ఏర్పాటు చేశారని, పంచాయతీని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న తమ నాయకుడిపై ఇకనైనా బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని కోరారు. పంచాయతీలోని దాదాపు తొమ్మిది మంది వార్డు సభ్యులు కొన్ని ప్రలోభాలకు లోనై చేస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. తాము ఎప్పుడయినా అవినీతిపై ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన ఈ సందర్బంగా తెలియచేసారు.
అనంతరం దళిత నాయకురాలు మద్దిలేటమ్మ మాట్లాడుతూ తమ నాయకునికి గౌరవం ఇచ్చి మాట్లాడాలని, సవాళ్ళను తాము స్వీకరిస్తున్నామని, వాస్తవాలు పంచాయతీ ప్రజలకు తెలుసునని, వ్యాఖ్యలు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు గ్రహించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో దళిత నాయకులు శ్రీపతి మనోహర్, మద్దిలేటమ్మ, ముద్దల ఓబులేసు, ఆకుమళ్ళ మనీష్, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments