శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుని ఆలయంలో కరెంటు కష్టాలు
దేవుడి గుళ్ళకు తప్పని కరెంటు కష్టాలు-ఐదు రోజులుగా చీకటిలోనే దీపారాధన-అధికారుల ధోరణి తో భక్తుల్లో పాలకుల పై విమర్శ.-ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు చొరవ చూపాలి అంటూ భక్తులు విన్నపం.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం పాత చిట్వేలు గ్రామంలో సుమారు మూడు శతాబ్దాల చరిత్రను సంతరించుకుని మట్లి రాజుల కాలంలో నిర్మితమై విరాజిల్లి ఒకప్పుడు శిథిలావస్థకు చేరుకున్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయం నేడు కొందరు దాతలు మరికొందరు భక్తులు సహాయంతో దినదినాభివృద్ధి చెందుతూ తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుని పచ్చని పొలాల మధ్యన వెదజల్లుతున్న ఆ ఆలయానికి మండల విద్యుత్ అధికారులు ఏకపక్ష ధోరణితో గత ఐదు రోజులుగా కరెంటు కష్టాలు మొదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే పాత చిట్వేలి గ్రామం నుంచి దేవాలయానికి కరెంటు సరఫరా ఉండగా గత కొద్ది రోజుల క్రితం నుంచి మండల విద్యుత్ అధికారి దేవాలయం అయినప్పటికీ మీటర్ లేనందున సప్లై ఆపివేశారు. దేవాలయ ధర్మకర్తలు,ప్రజలు కళ్యాణ మండపం పనులు జరుగుతున్నందున కొద్దిరోజుల పాటు సరఫరా ఇవ్వాలని తదుపరి కళ్యాణ మండపం ద్వారా ఆదాయ రాబడి ఏర్పడుతుందని ఫలితంగా మీరు కోరినట్లు చేస్తామని తెలిపిన ససేమిరా అంటూ సదరు గ్రామ లైన్మెన్ సహాయంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అయితే దేవాలయం పేరుతో మీటర్ ఇవ్వాల్సిందిగా కొరిననూ అలా కుదరదు ఎవరైనా వ్యక్తి పేరు తోనే ఇవ్వవలసి ఉంటుందని అధికారి తెలపడంతో చేసేదిలేక వారు కోరిన విధంగా గ్రామ పెద్ద వ్యక్తిగత ఆధార్ కార్డు డిపాజిట్ రుసుమును జమ చేశారు. అయినను ఐదు రోజులు గడుస్తున్నా విద్యుత్ సరఫరాకు అవసరమైన కరెంట్ స్తంభాలను, వైరును మీరే సమకూర్చుకోవాలి అంటూ అధికారులు తేల్చి చెప్పడంతో చేసేదేమీలేక బాధితులు ఆలోచనలో పడ్డారు. ఈరోజు శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు ఉండడంతో భక్తులు చీకటిలో దేవాలయ దర్శనానికి వెళుతూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ మాకేమీ తెలియదులే అన్నట్లు అధికారులు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
మసీదులకు, చర్చలకు విద్యుత్తు ఉచితం, చేతి వృత్తుల వారికి మినహాయింపు అంటూ ప్రకటిస్తున్న ప్రభుత్వానికి ఈ దేవాలయానికి ఉచితంగా ఇవ్వడం వల్ల నష్టం వాటిల్లుతుందా ఉందా!! ?? అంటూ భక్తులు వాపోతున్నారు.
ఏది ఏమైనా వేలాదిమంది భక్తుల మనో భావానికి సంబంధించిన ఈ ఆలయంలో పూర్తి స్థాయిలో కరెంట్ లేకపోవడం దురదృష్టకరం. ప్రజా ప్రతినిధులు,పైఅధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే శ్రీ వీరభద్ర సమేత భద్రకాళి అమ్మవారి ఆలయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించ వలసినదిగా చిట్వేలు గ్రామస్తులు, భక్తులు మూకుమ్మడిగా కోరుతున్నారు.
Comments