మహిషాసుర మర్దిని గా, గంగాభవానిగా శ్రీభద్రకాళి అమ్మవారు.
---దర్శనార్థం పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. అందరిని ఆకట్టుకున్న ద్విపాత్ర అలంకరణ.
దసరా ఉత్సవాల్లో భాగంగా దసరా పండుగ పర్వదినాన అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని పాత చిట్వేలు గ్రామంలో శ్రీ వీరభద్ర సమేత భద్రకాళి అమ్మ , స్వామి వార్లకు బుధవారం విశేష అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు మృత్యుంజయ శాస్త్రి, భద్రకాళి అమ్మవారి మూల విగ్రహానికి రౌద్ర రూపిని అయిన మహిషాసుర మర్దిని అలంకారాన్ని, ఉత్సవ విగ్రహానికి శాంతి స్వరూపిణి అయిన గంగాభవాని అలంకారాన్ని పట్టు వస్త్రాలతో ఆభరణాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు.
మహిషాసుర మర్దిని రూపం భయాన్ని కలిగించగా, చిద్విలాసంతో కూడిన గంగాభవాని రూపం,గంగమ్మ నుండి నీరు శివుని విగ్రహంపై జాలువారుతున్న తీరు భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు, పిల్లలు అమ్మవార్ల ద్విపాత్ర అలంకరణలను ఒకేసారి దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందని వారి అభిప్రాయాన్ని వినిపించారు. వచ్చిన భక్తాదులందరికి పులిహోర, పంచామృతాలను ప్రసాదాలుగా ఆలయ కమిటీ సభ్యులు అందించారు.
Comments