శ్రీ చైతన్య లో వేడుకగా ఫుడ్ ఫెస్టివల్ డే
రాజంపేట, పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డు లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా ఫుడ్ ఫెస్టివల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క రాష్ట్రంలో ఆహార సంప్రదాయాలను, వాటి యొక్క ప్రత్యేకతలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తీసుకువచ్చిన వివిధ రకాల వంటల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, ప్రైమరీ ఇంచార్జ్ కస్తూరి, శ్రీదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments