వైభవపీతంగా కొనసాగుతున్న దొండ కొండమ్మ తిరుణాల మహోత్సవం.
--రేపటి రోజుతో ముగుస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడి.
--అందరూ ఆహ్వానితులేనన్న ఆయా గ్రామ ప్రజలు.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలోని కంపసముద్రం పంచాయతీ గాంధీనగర్ గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ దొండకొండమ్మ తిరుణాల మహోత్సవం ఈ నెల 12వ తారీకు నుంచి మొదలై రేపటి రోజున అనగా ఆదివారం 17వ తేదీ నాటికి ముగియనుంది.
ఈ తిరుణాల మహోత్సవాన్ని మండల పరిధిలోని గాంధీనగర్, బాలాజీ నగర్, వైయస్సార్ నగర్, లక్ష్మీపురం, మార్గోపల్లి, చాపరోపల్లి, గుడ్లవారిపల్లి,కుమ్మరపల్లి తదితర గ్రామాలలోనే కాక.. అమ్మవారి జన్మస్థానమైన ఓబులవారిపల్లి మండలంలోని తుంగవారి పల్లి లో కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం.
ఉత్సవం మొదలు కొని చివరి రోజు వరకు గ్రామస్తుల అందరూ కలిసి పూజా కృతులు, ఊరేగింపు ఉత్సవం, అన్నదానం తదుపరి కార్యక్రమాలు నిర్వహించగా..రేపటి రోజున సంబంధిత గ్రామాల్లోని ప్రజలు పొంగల్లు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకోనున్నారు. మండల పరిధిలోని భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని పై అన్ని గ్రామాల పెద్దలు, యువత, మహిళలు,పిల్లలు,ప్రజలందరూ కలిసికట్టుగా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Comentarios