శ్రీశ్రీ దత్తగిరి తపోవన నిర్వాహకరాలు నారాయణమ్మ ఇకలేరు.
-సాయంత్రం జరిగిన అంత్యక్రియలు-పలువురు సంతాపం.
రాపూరు నెల్లూరు రోడ్డు తిమ్మాయపాలెం క్రాస్ శ్రీ శ్రీ దత్తగిరి నారాయణ(82) తపోవన నిర్వాహకురాలు కొరముట్ల నారాయణమ్మ అనారోగ్య కారణంగా ఈ రోజున (బుధవారం) మృతి చెందారు. సాయంత్రం బంధుమిత్రులు అంత్యక్రియలు చేపట్టారు.
నిరంతరం దైవాన్ని తలుస్తూ దైవభక్తిలో తనువు చాలించిన నారాయణమ్మ...తాను ఓ పేదరాలు. అయినా దైవచింతనే ఆమె ప్రాణం. చిట్వేలు మండల పరిధిలోని ఎం గొల్లపల్లి కు చెందిన ఆమె మొదటగా రాజగుంట క్రాస్ ఆంజనేయస్వామి దేవాలయానికి పునాది నిర్మాతగా వ్యవహరించిందని, కొన్ని కారణాల చేత అక్కడ నుంచి వేరుపడి మర్రిచెట్టు దగ్గర సీతారామ సమేత ఆలయాన్ని నిర్మించగా వరద రూపంలో ఆ దేవాలయం కొట్టుకుపోయిందని,తదుపరి చారిత్రక ఆనవాళ్లు ఉన్న శ్రీ శ్రీ దత్తగిరి నారాయణ తపోవనానికి పూర్వ వైభవాన్ని తేవడంలో ఎన్నో ఆర్థిక, అధికార ఇబ్బందులు తలెత్తినా తాను ఎంచుకున్న భగవత్ మార్గాన్ని పట్టు విడవక ప్రజా ప్రతినిధుల, రాజకీయ నాయకుల, ప్రజల సహాయ సహకారాలతో గత కొద్ది నెలల క్రితమే విగ్రహాల ప్రతిష్ట లోను, పలు కార్యక్రమాల నిర్వహణలోనూ అందరి చేత కీర్తింపబడిందని, తాను లేని లోటు తీర్చలేనిదని అంత్యక్రియలు హాజరైన పలువురు పేర్కొన్నారు.
స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు, చక్రపాణి రెడ్డి, శివశక్తి సభ్యులు, స్థానిక గ్రామ ప్రజలు తదితరులు అంతిక్రియలకు హాజరయ్యారు. పండుగ కారణంగా అంత్యక్రియలకు హాజరుకాలేని చాలామంది నాయకులు, ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
Comentarios