సివిల్స్ ఫలితాలలో శ్రీ పూజకు 62 వ ర్యాంకు.
--చిన్నతనం నుంచే పోటీ పరీక్షల్లో తనదైన గుర్తింపు.
--తండ్రి జోడించిన లక్ష్యాలతో పెరిగిన మరింత పట్టుదల.
--చిట్వేలు, రాజంపేట వాసుల అభినందనల వెల్లువ.
బిడ్డ పుట్టినప్పుడు కాదు తాను కీర్తిగడించిన ప్పుడు తల్లిదండ్రులకు ఆనందం అన్న సామెత శ్రీ పూజ నిజం చేసింది.
సోమవారం నాడు వెలువడిన సివిల్స్ ఫలితాలలో రెండవ ప్రయత్నంలోనే 62 వ ర్యాంకు సాధించి ఘన కీర్తిని గడించింది.
వివరాల్లోకి వెళితే తన తండ్రి గారి స్వస్థలం పశ్చిమ గోదావరి అయినప్పటికీ ఉద్యోగరీత్యా పూర్వపు కడప జిల్లాలోని చిట్వేలు, రాజంపేట లోని కూచివారి పల్లి, పెద్ద కారం పల్లి తదితర గ్రామాలలో పంచాయతీ సెక్రటరీ గా సుదీర్ఘకాలంపాటు సేవలందించి సౌమ్యుడిగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం రాజధాని అమరావతి లో ఈ ఓ పి ఆర్ డి స్థానంలో సేవలందిస్తూ ఉన్న వెంకటేశ్వర్లు రెండవ కుమార్తె శ్రీ పూజ.
తన ప్రాథమిక విద్యాభ్యాసం చిట్వేలి మండలంలోని సాయి విజ్ఞాన్ పాఠశాల నందు తదుపరి పదో తరగతి వరకు రాజంపేట లోని రాజు విద్యాసంస్థల నందు సాగింది. తదుపరి ఐఐటి చదువు కొనసాగించి తన తండ్రి సాధించాలన్న లక్ష్యాన్ని తన తన లక్ష్యంగా చేసుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధమై నిపుణుల సూచనలతో సుమారు రోజుకు 16 గంటలు కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని రెండవ ప్రయత్నంలో సాధించడంతో కుటుంబీకులలో ఆనందం వెల్లివిరిసింది.
తన తండ్రితో పరిచయాలు ఉన్న చిట్వేలు రాజంపేట పరిధిలోని ప్రజా ప్రతినిధులు,నాయకులు,అధికారులు, CHS సభ్యులు, స్నేహితులు, యువత, విద్యాసంస్థల యాజమాన్యం శ్రీ పూజకు అభినందనలు తెలిపారు. నేటి పిల్లలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని కేవలం మార్కుల సాధనకే కాక చదువులో విపులీకరణ సాధించి పోల్చడం నేర్చుకోవాలని,చక్కని ప్రణాళికతో సుదీర్ఘ లక్ష్యాలను చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
Comentários