కడప జిల్లా, రైల్వేకోడూరు చిట్వేలి మండల పరిధిలోని పాత చిట్వేలి గ్రామం లో నాలుగు వందల సంవత్సరాల నాటి మట్లి రాజుల కాలం లో నిర్మితమై.. ప్రస్తుతం శిథిలావస్థ లో ఉన్న" శ్రీ వరదరాజ స్వామి" ఆలయాన్ని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆలయ అభివృద్ధికి సహాయం అడిగిన తక్షణమే.. ఏపీఎండీసీ ఎం డి వెంకట్ రెడ్డి మరియు వారి ధర్మపత్ని సందర్శించగా.. ఆలయ పూజారులు, వైసిపి నాయకులు, ప్రజలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.
గ్రామ ప్రజలతో కలిసి ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి 75 లక్షల రూపాయలు సమకూరుతాయని ఇందులో ఏపీఎండీసీ తరఫున 14 లక్షలు, మిగిలిన నిధులు ఎండోమెంట్ ద్వారా సమకూరుతాయని అన్నారు. అంతేకాక రెండు లక్షల తన సొంత నిధులతో వరదరాజ స్వామి వారికి వెండి పాదాలు బహుకరిస్తామని ఎండి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దానికి తోడుగా గ్రామ ప్రజలు కూడా తోడ్పాటును అందిస్తే తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం సులభతరం అవుతుందని.. పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు మన చుట్టుప్రక్కల ఉండడం మన అదృష్టమని వాటిని కాపాడుకోవడం మన కర్తవ్యమని తాను పేర్కొన్నారు. తదుపరి వీరభద్ర స్వామి ఆలయాన్ని సోమేశ్వర స్వామి ఆలయాన్ని వారు సందర్శించారు.
మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ చౌడవరం ఉమా మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ ఆలయ విశిష్టత ను ఎమ్మెల్యే కొరముట్ల తో కలిసి ఏపీఎండీసీ ఎం డి వెంకట్ రెడ్డి కి తెలిపిన వెంటనే సహాయాన్ని అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు లింగం లక్ష్మీకర్, బండారు గుండయ్య, ఆకేపాటి వెంకట్ రెడ్డి, హజరత్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీను, నవీన్, మోచర్ల నరసింహ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments