వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరులో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం (అమ్మవారిశాల) నందు నేడు కన్యకా పరమేశ్వరి జయంతి సందర్బంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అలంకారాలతో కన్యకా పరమేశ్వరి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆరు గంటలకు మహాప్రాకార ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే నేడు అమ్మవారిశాలలో చెండి హోమము, పంచామృతాభిషేకము, సహస్రనామ కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఉదయం 5:30 నిమిషాలకు - శ్రీ వాసవి సుప్రభాతం, 7:00 గంటలు - శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, 8:30 నిమిషాలకు సప్తశతి పారాయణము, రుద్ర, నవగ్రహ, చండి హోమం, 11:35 నిమిషాలకు పంచామృతాభిషేకం, అమ్మవారి అలంకరణ, మధ్యాహ్నం 12:15 నిమిషాలకు శ్రీ వాసవి సహస్రనామ కుంకుమార్చన, మహా మంగళహారతి, 12:30 నిమిషాలకు భోజన ప్రసాద, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షులు బుశెట్టి రామ్మోహన్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షుడు బుశెట్టి రామ్ మోహన్, వైస్ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ రవీంద్ర బాబు, సెక్రటరీ మురికి నగేష్, జాయింట్ సెక్రటరీ మీద వెంకటేశ్వర్లు, కోశాధికారి జాలాది పరమేష్, ఆర్యవైశ్య సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Comments