కమనీయం రమణీయం శ్రీవీరభద్రుని కళ్యాణం.
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా.. చిట్వేలి మండల పరిధిలోని పాత చిట్వేలి గ్రామంలో మట్లి రాజుల కాలంలో వెలసి ప్రసిద్ధి గాంచిన శ్రీభద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయం నందు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. అశేష భక్తులతో మంగళ వాయిద్యాల నడుమ, తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు మరియు ఆలయ అర్చకులు మృత్యుంజయ, ఉదయ్ కిరణ్ లు మంత్రోచ్ఛారణలు చదువుతూ వివాహం లోని ప్రతి ఘట్టాన్ని విపులంగా వివరిస్తూ ఉండగా కళ్యాణోత్సవం కనులవిందుగా సాగింది. అగ్ని హోమ క్రతువులు నిర్వహించారు.
అడ్వకేట్ రఘునాధరెడ్డి అమ్మవారికి బంగారు తాళిబొట్టు ను, విఆర్వో గోపాలకృష్ణంరాజు కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లకు వెండి నగలను బహుకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేకమంది ప్రముఖులు మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు పెద్దలు,భక్తులు కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు.తదుపరి వేలాది మంది భక్తులకు ఆలయ పెద్దలు సుబ్బరాయుడు రాజు, చైర్మన్ చంద్రమోహన్ రాజు, ప్రధాన కార్యదర్శి తిరుమల రెద్దయ్య, యన్నారు కిషోర్ కుమార్ భక్తులు మరియు యువకులు కలిసి తీర్థ ప్రసాదాలు,రుచికరమైన భోజన సదుపాయాన్ని కల్పించారు.
Comments