విజయనగరం జిల్లాలో గిరిజన విద్య ఎటువైపు పయనిస్తుంది? అని అడిగితే అది తిరోగమనం దిశగా వెలుతుంది అని చెప్పక తప్పదు. ఒకవైపు ప్రభుత్వ విధానాలు. మరోవైపు అదికారులు నిర్లక్ష్యం, వ్యక్తిగత ప్రయోజనం తో గిరిజన విద్యార్థులు తీవ్రమైన నిర్లక్ష్యానికి,అన్యాయానికి గురౌతున్నారు అని అన్నారు.
ఒకప్పుడు ఉపాధ్యాయులు లేరని, మౌళిక సదుపాయాలు లేవని మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పడు గిరిజన విద్యార్థుల మరణాలు, గిరిజన బాలికలపై వేదింపులు, అత్యాచారాలు, గర్భం దాల్చిన, ప్రశవించిన వంటి వార్తలు మాట్లాడు కోవసిన దుస్థితి. దీనికి కారణం ఎవరు? కనీసం బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించలేరా?గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏ.ఎన్.ఎమ్. లాంటి వైద్య సిబ్బందిని నియమించలేరా?? ఒక వసతి గృహానికి ఒక సంరక్షకుని నియమించలేరా??? గిరిజన విద్యార్థులు ఏం పాపం చేసారని? పాలకులు, అదికారులను గిరిజన సంక్షేమ సంఘం తరుపున అడుగుతున్నం అని ప్రశ్నించారు.
Comments