సగిలిగుడ్డుపల్లెలో గోమాతకు ఘనంగా శ్రీమంతం
ముల్లోకాల్లో ఉన్న దేవతామూర్తులు అందరూ గోమాతలో ఉంటారని హిందువుల నమ్మకం
గోమాతకు శ్రీమంతం చేసి మురిసిపోయిన దంపతులు పద్మావతమ్మ,నరసింహారెడ్డి
కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ మండలం తాళ్ళమాపురం పంచాయతీలోని సగిలిగుడ్డుపల్లెలో గర్భం దాల్చిన ఒక ఆవుకు శనివారం గంగిరెడ్డి పద్మావతమ్మ, నరసింహారెడ్డి దంపతులు స్థానికులతో కలిసి గోమాతకు ఘనంగా శ్రీమంతం నిర్వహించారు. స్థానిక మహిళలు సాంప్రదాయ పద్ధతిలో ఆవుకు పసుపు, కుంకుమలతో పూజించి నూతన వస్త్రాలు,పూలతో అలంకరించి వేడుక జరిపారు.అనంతరం శ్రీమంతం కు వచ్చిన మహిళలు అందరికి పసుపు-కుంకుమ సారె అందించారు. దీంతో వారు పట్టరాని సంతోషానికి గురై సొంత కూతురికి నిర్వహించినట్లుగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ రైతు కుటుంబం ఆవుకి శ్రీమంతం చేసారు. చాలా అట్టహాసంగ ఒక ఆడపిల్లకు తల్లిదండ్రులు ఎలాగైతే శ్రీమంతం చేస్తారో అలాగే ఆవుకు కుడా శ్రీమంతం జరిపి పండంటి బిడ్డను కనాలని ఆకాంక్షించారు.పూజారి సమక్షంలో ఆవుకు గాజులతోపాటు, పండ్లు, చీర, కుంకుమ వంటివి పెట్టి వైభవంగా శ్రీమంతం జరపడంతో వేడుకను పలువురు తిలంకించారు.ఈ కార్యక్రమంలో మహిళలు వారి ఇంట్లో స్వయంగా చేసిన పిండి పదార్ధాలు గోమాతకు దీవించి మహిళలు శ్రీ మంతం పాటలు పాడుతూ గోమాత దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామం లో అన్నదాన కార్యక్రమం చేశారు. హిందూ సంప్రదాయ ప్రకారం గోమాతను హిందువులు ఏవిధంగా పూజిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Comentarios