కన్నుల విందుగా సాగిన శ్రీ సీతారాముల కళ్యాణం. - అశేషంగా పాల్గొన్న భక్తులు.
శ్రీరామనవమిని పురస్కరించుకుని చిట్వేలు మండల పరిధిలోని రాజుకుంట, చెర్లోపల్లె గ్రామాల నందు ఈరోజు ఉదయం గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ చూడముచ్చటగా సాగింది.
నిన్నటి నుంచే కళ్యాణానికి చలువ పందిరి పచ్చని తోరణాలు గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొని ఏర్పాటు చేయగా.. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి స్వామివారి కళ్యాణానికి సంసిద్ధం చేయగా గ్రామ పురోహితులు సుబ్బు స్వామి వారు శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలకు పట్టు బట్టలను ధరించి చేసి పూలమాలవేసి వేద మంత్రాలతో కళ్యాణాన్ని ప్రారంభించారు.
శ్రీరామనవమి విశేషాలను శ్రీ రాముని విశిష్టతను విపులంగా పురోహితులు వివరించగా వచ్చిన భక్తులందరూ వారి మాటలు ఆలకిస్తూ కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం అందరికీ గ్రామస్తులు అందజేశారు.
తదుపరి నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా సాయంత్రం కళ్యాణం విగ్రహాలకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున ఆయా గ్రామ ప్రజలు, యువత, పిల్లలు పాల్గొని భక్తిశ్రద్ధలతో సంతోషాలతో కార్యక్రమాలు నిర్వహించారు.
Comentarios