కడప జిల్లా, ప్రొద్దుటూరులో తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు నీరే ఆధారం అని, ముఖ్యమంత్రి వైకాపా పెద్దలు అగాహన రాహిత్యంతో ప్రాజెక్టు 801 అడుగుల డెడ్ స్టోరేజీకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజికి వచ్చే వరకూ నీరు ఎందుకు వాడారు అని ఎద్దేవా చేశారు వచ్చే ఏడాది వర్షాలు కురవకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని, దీనిపై ప్రజలు, రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కృష్టా జలాలు లేకపోతే రాయలసీమకు ప్రత్యామ్నాయం లేదని, అన్ని తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
Comentários