top of page
Writer's pictureMD & CEO

శ్రీశైల మల్లన్న స్పర్శదర్శన వేళల్లో మార్పు

శ్రీశైల మల్లన్న స్పర్శదర్శన వేళల్లో మార్పు

-వారంలో నాలుగు రోజులు పాటు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం


-మధ్యాహ్నం 2 గంటల నుంచి 4గంటల వరకే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి


-నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి, తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణ భక్తులకే శ్రీస్వామివారి స్పర్శ దర్శనం భాగ్యం


-భక్తుల విజ్ఞప్తి మేరకు వారి సౌకర్యార్థం దర్శన వేళల్లో మార్పులు చేసిన శ్రీశైల దేవస్థానం


శ్రీశైలం:భక్తుల విజ్ఞప్తి మేరకు,భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానంలో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు.మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులందరికీ కల్పిస్తున్న శ్రీస్వామివారి స్పర్శదర్శన వేళలు మార్పులు చేసి ఈ నెల 31వ తేదీ నుంచి వారంలో నాలుగురోజులపాటు అనగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2.00గంటల నుంచి 4.00గంటల వరకు మాత్రమే భక్తులందరికీ శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా గతములో వారంలోని నాలుగు రోజులలో (మంగళవారం నుంచి శుక్రవారం వరకు)మధ్యాహ్నం 2.00గంటల నుంచి గం.3.00ల వరకు మరియు తిరిగి సాయంత్రం సాయంత్రం 6.00గంటల నుంచి 7.00గటల వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పించడం జరుగుతుండేది.అయితే మధ్యాహ్నం 3.00గంటల తరువాత స్వామివారి అలంకార దర్శనం మాత్రమే లభిస్తున్నదని, స్వామివార్ల స్పర్శదర్శనం కోసం తిరిగి సాయంత్రం 6.00గంటల వరకు వేచి వుండాల్సి వస్తున్నదని, దీనివలన దర్శనానంతరం ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇబ్బందికరంగా ఉన్నదని పలువురు భక్తులు దేవస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది.ఈ మేరకు భక్తులు దర్శనానంతరం వారి వారి ప్రాంతాలకు వెళ్ళేందుకు వీలుగా మధ్యాహ్నం 3.00గంటల తరువాత కూడా శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించవలసినదిగా కూడా భక్తులు కోరడం జరిగిందని ఈ విషయమై భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మధ్యాహ్నం 2.00గంటల నుంచి సాయంత్రం 4.00గంటల వరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగిందన్నారు.మధ్యాహ్నం గంటసేపు అదనంగా స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా గతంలో సాయంకాలం 6.00గంటల నుంచి రాత్రి 7.00గంటల వరకు అమలులో ఉన్న స్పర్శదర్శన సదుపాయం నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా స్వామివారి స్పర్శదర్శనానికి వచ్చే భక్తులందరు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావలసి వుంటుందని సంప్రదాయ వస్త్రధారణలో పురుషులు పంచ మరియు కండువాను,మహిళలు చీర మరియు రవిక లేదా చున్నీతో కూడిన సల్వార్ కమీజ్ లను ధరించవలసి వుంటుందని ఈవో పేర్కొన్నారు.

97 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page