ప్రశాంతంగా పది పరీక్షలు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రాజంపేట మండలంలో పదవ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో ఎనిమిది కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తుండగా ప్రతికేంద్రం లోనూ సిట్టింగ్ స్క్వాడ్ తో మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించారు.
ఉదయం 9 గంటలు నుంచి 12:45 వరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్-ఏ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్-బి, మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల, జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల, ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 8 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ తెలియజేశారు. మొదటి పరీక్ష తెలుగుకు 8 కేంద్రాలలో 1416 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1397 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
Commentaires