19 నుంచి టెన్త్ మూల్యాంకనం
పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు జరగనుంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 23 కేంద్రాల్లో మూల్యాంకనం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మూల్యాంకనంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లపై పాఠశాల విద్య కమిషనర్ సురేశ్కుమార్ పలు సూచనలు చేస్తూ ఉత్త ర్వులు జారీచేశారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఒక్కొక్కరు రోజుకు 40 పేపర్లు దిద్దాలని సూచించారు. వారు దిద్దిన పేపర్ల మార్కులను స్పెషల్ అసిస్టెంట్లు లెక్కించాలన్నారు. ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కుల సమాధానాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎగ్జామినర్లు, అసిస్టెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని డీఈవోలను ఆదేశించారు.
Comments