తాడేపల్లిగూడెం స్టేట్ బ్యాంక్ సిబ్బంది చేతివాటం
ఖాతాదారుడి ఖాతాలో నుండి రూ. 42 లక్షలు దొంగిలించిన బ్యాంకు సిబ్బంది
కేసుని చాలెంజింగ్ గా తీసుకొని ముద్దాయిని అరెస్ట్ చేసిన తాడేపల్లిగూడెం పోలీసులు
తాడేపల్లిగూడెం సిఐ, యస్ఐ, సిబ్బందిని అభినందించిన భీమవరం డీఎస్పీ
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం స్టేట్ బ్యాంకు లో ఖాతాదారుడు ఖాతా నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా నగదు బదిలీ చేసి కాజేసిన బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసి ముద్దాయిలను రిమాండుకు తరలించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, తాడేపల్లిగూడెం టౌన్ సుబ్బారావు పేట లు ఉండే ఎలిసేట్టి నరసింహారావు అను వ్యక్తీ తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లో తనకు తాడేపల్లిగూడెం మెయిన్ బ్రాంచ్ లో తన చెల్లి తో జాయింట్ ఎకౌంటు ఉన్నట్లు, సదరు ఎకౌంటు లో 42 లక్షలు పై చిలుకు ఉన్నట్లు అనంతరం తాను పుట్టపర్తి వెళ్లి సాయిబాబా సన్నిధిలో ధ్యానం కి 2022 ఫిబ్రవరి నెలలో వెళ్లి జూలై లో తిరిగి తాడేపల్లిగూడెం వచ్చి బ్యాంకు కు వెళ్లి ఎకౌంటు లో నగదు చూడగా రూ. 43 లక్షలులో రూ. 42 లక్షలు దొంగలించబడినట్లు గమనించి తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సదరు ఎకౌంటు కి ఎటువంటి ఫోన్ నంబరు లింక్ గాని ATM గాని లేనట్లు, సదరు ఫోన్ నంబరు లింక్ లేదని గమనించిన దుండగులు రాయచోటి జిల్లా గాలివీడు SBI బ్రాంచ్ లో తనకు పరిచయం ఉన్న అప్పలరాజు పవన్ కుమార్ అను అసిస్టెంట్ మేనేజర్ పూసపూటి వెంకట నవీన్ కుమార్ అను క్లర్క్ సహాయంతో సదరు ఎకౌంటుకి దుండగులు చెప్పిన ఫోన్ నంబరును అనధికారికంగా, బ్యాంకు నియమావళిని ఉల్లంచించి యాడ్ చేసి పిదప సదరు ఫోన్ నంబరు సహాయం తో 27- UPI ట్రాన్సేక్షన్ ల ద్వారా నగదు ని వివిధ రాష్ట్రాలలో దుండగులు పరిచయస్తులైన ఉన్న ఎకౌంటు లకు ట్రాన్స్ఫర్ చేసి సదరు నగదు ని కాజేసారని దర్యాప్తులో తేలింది.
సదరు జరిగిన ఫ్రాడ్ బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో కాజేశారు. దాని గురుంచి బ్యాంకు వారికి తెల్పి RBI గైడ్లైన్స్ మేరకు సదరు బ్యాంకు వారిని ఫిర్యాది కి నగదు ని తిరిగి చెల్లించమని బ్యాంకు వారికి పోలీస్ వారు కరెస్పాండెన్స్ చేయగా సదరు బ్యాంకు వారు ఫిర్యాది కి పోయిన 42 లక్షలను తిరిగి చెల్లించారు. అంతట సదరు ముద్దాయిల కొరకు హర్యానా, ఢిల్లీ, అస్సాం రాష్ట్రాలలో విచారించి వారి వివరాలను సేకరించి సదరు కేసులో ప్రధాన నిందుతులు అయిన బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్ లను ఈ రోజు అరెస్ట్ చేయడమైనది. ఈ కేసుని చాలెంజింగ్ గా తీసుకొని ముద్దాయిని అరెస్ట్ చేసిన తాడేపల్లిగూడెం టౌన్ సిఐ, యస్ఐ జిజే ప్రసాద్, సిబ్బందిని భీమవరం డీఎస్పీ అభినందించినారు.
Comments