ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు పట్టణం రాజీవ్ సర్కిల్ వద్ద గల ఎన్జీఓ హోమ్ నందు అధ్యక్షుడు రఘురామి రెడ్డి అధ్యక్షతన నూతన ఆధునీకరణ చేసిన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేవి శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాస్, కార్యదర్శులు శ్రీనివాస్, డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స మూడు జేఏసీలతో చర్చలు జరిపారని తెలిపారు. ఉద్యోగుల పిఎఫ్ నగదు ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు, తాము దాచుకున్న జిపిఎఫ్ నగదు కూడా ఇవ్వకపోవడం దారుణమని, ఖాతాలో డబ్బు మాయం చేయడం చాలా దుర్మార్గమని బండి శ్రీనివాసరావు అన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డిఏ లను త్వరలోనే క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరామని, జీతాల కోసం ఉద్యోగులు డిమాండ్ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితిని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారని ఆ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి రామ సుబ్బయ్య, పలువురు ఎన్జీఓ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments