---జ్యోతి ప్రజ్వలన గావించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాంచంద్రారెడ్డి,
---ప్రత్యేకంగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు-ఎమ్మెల్యే తో పాటు పలువురు దూరం.
చిట్వేలి మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంగా శనివారం ప్రారంభమైన 67వ రాష్ట్ర స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తి రాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, డిప్యూటీ డిఇఓ వరలక్ష్మి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండా, ఎస్ జి ఎఫ్ జండాలను ఎగరవేసి కబడ్డీ ఆటలను ప్రారంభించారు.
కబడ్డీ ఆడుతున్న జట్లు
13 జిల్లాల నుంచి వచ్చిన 26 జట్ల అభ్యర్థులు మార్షల్ నిర్వహించారు. స్థానిక విద్యార్థులు పలు జానపద, సాంస్కృతిక నృత్యాలు నిర్వహించారు. తొలిసారి చిట్వేలి కేంద్రంగా రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని క్రీడా స్ఫూర్తితో ప్రతి విద్యార్థి విజయం సాధించాలని, గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
కాగా ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ప్రజా ప్రతినిధులు, విద్యా కమిటీ చైర్మన్,పలువురు మండల స్థాయి అధికారులు దూరంగా ఉండటంపై ఆటల నిర్వహణ అధికారులు సముచిత స్థానం మరిచారని, ప్రోటోకాల్ పాటించలేదన్న విమర్శలు మండల వ్యాప్తంగా వినిపించాయి.
విద్యార్థుల జానపద నృత్యం.
క్రీడాకారులకు వసతులను కల్పించడంలో స్థానికంగా సహకారం అందించిన సి హెచ్ ఎస్, మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, అడిగిన వెంటనే ఆర్థికంగా ఆదుకున్న స్థానిక నాయకులకు, పూర్వ విద్యార్థులకు నిర్వహణ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి, అధ్యాపకులు ఏబీఎన్ ప్రసాద్, తిరుమల విశ్వనాథం, క్రీడ నిర్వహణ అధికారులు వసంత, పిడి డేవిడ్ ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉప ఎంపీపీ సుబ్రమణ్యం రెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్ర, గాడి ఇంతియాజ్ ,ముని రావు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
Kommentare