విజేతలగా కర్నూలు, శ్రీకాకుళం.
చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ప్రారంభమైన అండర్ 14 రాష్ట్రస్థాయి 67వ కబడ్డీ పోటీలు సోమవారంతో ముగిశాయి. పోటాపోటీగా సాగిన ఈ పోటీలలో బాలుర విభాగంలో మొదటి స్థానం కర్నూలు, రెండవ స్థానం కడప, మూడవ స్థానం విజయనగరం, నాల్గవ స్థానంలో ప్రకాశం జిల్లాలు నిలిచాయి. బాలికల విభాగంలో మొదటి స్థానం శ్రీకాకుళం,రెండవ స్థానం చిత్తూరు మూడు నాలుగు స్థానాల్లో కృష్ణ అనంతపురం నిలిచాయి.
రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి భానుమూర్తి రాజు, వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంపీపీ టంగుటూరి చంద్ర తదితరులు గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలుపుతూ మెడల్స్ బహూకరించారు. గెలుపు ఓటములు సమానమని, ఓటమి గెలుపుకు నాంది అన్నారు. ప్రయత్నించడమే ఓ పెద్ద గెలుపు అని వెనుక స్థానాల్లో నిలిచిన జట్లను ప్రోత్సహించారు.
అధికారి భానుమూర్తి రాజు మాట్లాడుతూ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన హెచ్ఎం పురుషోత్తం రెడ్డికి, పిడి డేవిడ్ ప్రసాద్ కి, అధికారిని వసంతకి, ప్రజా ప్రతినిధులకు,స్థానిక నాయకులకు, స్వచ్ఛంద సంస్థలకు, పూర్వపు విద్యార్థులకు,పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కబడ్డీ పోటీలు జనవరి 29 మొదలు ఐదు రోజులపాటు రాజంపేట కేంద్రంగా నిర్వహించినట్లు తెలిపారు. పాల్గొనే అభ్యర్థులను ఇక్కడే ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఏబీఎన్ ప్రసాద్, తిరుమల విశ్వనాథం వైసిపి నాయకులు ఎం.కనకరాజా, ముద్దా హరినాథ్ రెడ్డి, శ్రీ పద్మావతి పాఠశాల డైరెక్టర్ ఎం నరేష్ బాబు, సర్పంచ్ గుత్తి నరసింహ, కంచర్ల సుధీర్ రెడ్డి, సి హెచ్ ఎస్ సభ్యులు గాడి ఇంతియాజ్, శివారెడ్డి, మానవతా బాధితులు సాయిరాం, స్థానిక, స్థానికేతర వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న 350 మందికి, కార్యక్రమ విధులు నిర్వహించిన ఎన్సిసి క్యాడేట్ లకు సిహెచ్ఎస్ మెమెంటోలు అందించారు. ఆర్థిక దాతలకు, అతిథులకు శ్రీ సాయి వికాస్ పాఠశాల యాజమాన్యం శాలువా మేమెంటులతో సత్కరించారు.
Comentarios