అమరావతి: ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.
పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రి వర్గం.
మంత్రివర్గం ఆమోదం తెలిపిన నిర్ణయాల్లో కీలకమైనవి.
– ప్రభుత్వం తరపున చేపట్టనున్న కార్యక్రమాలు కేబినెట్‌కు వివరణ. ఈమేరకు ఆమోదం తెలిపిన కేబినెట్
– మే 13 న మత్స్యకార భరోసా.
– 16న వైఎస్‌ఆర్ రైతు భరోసా.
– 19న వైఎస్‌ఆర్ సంచార పశు ఆరోగ్యసేవ– అంబులెన్స్‌లు ప్రారంభం.
– జూన్ 6న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేల) పరిధిలో 3000 ట్రాక్టర్లు, కంబైన్డ్ హర్వెస్టర్‌లు, ఇతర వ్యవసాయ ఉపకరణాల పంపిణీ.
– జూన్ 14న వైయస్సార్ పంటల బీమా పరిహారం చెల్లింపు.
– జూన్ 21న అమ్మ ఒడి అమలు.
– జూన్ 1 గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల.
గోదావరి డెల్టా పరిధిలో దేవుడి దయ వల్ల వర్షాలు బాగా కురిసి రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు నిల్వ ఉన్న నేపధ్యంలో... ముందస్తుగానే నీటి విడుదల.
ఫలితంగా రైతులు తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల బారిన పడి నష్టపోకుండా ఉండటంతో పాటు... మూడో పంటకు కూడా అనుకూలంగా ఉండేలా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సాగునీటిని అడ్వాన్స్‌డ్‌గా విడుదల చేసే కార్యక్రమం.
– జూన్ 10న కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల.
– జూన్ 10న గుంటూరు ఛానల్, జులై 15 నాగార్జున సాగర్ ప్రాజెక్టు(ఎన్‌ఎస్‌పీ) పరిధిలో నీటి విడుదల.
– జూన్ 10న పెన్నాబేసిన్‌లోని గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగళ్ళు నుంచి సాగునీరు విడుదల.
– జూన్ 30న ఎస్‌ఆర్‌బీసీ పరిధిలోని గోరకల్లు అవుకు ప్రాజెక్టుల కింద నీటి విడుదల.
– కృష్ణాజిల్లా పామర్రులో పీహెచ్‌సీని సీహెచ్‌సీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం. రూ.8.18 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. 38 అదనపు పోస్టులు మంజూరుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.
– పులివెందులలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. 26 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ.
– వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు, ప్రై మరీ ప్రాససింగ్ సదుపాయాలు, ఫాంగేట్ మౌలిక సదుపాయాలు... తదితర పనులకోసం ఆర్ధిక సంస్ధల నుంచి రూ.1600 కోట్లు రుణ సమీకరణకు కేబినెట్ ఆమోదం.
– మార్క్‌ఫెడ్‌లో కొత్తగా 30 పోస్టులకు కేబినెట్ ఆమోదం. 8 డిప్యూటీ మేనేజర్లు, 22 అసిస్టెంట్ మేనేజర్లను నియమించనున్న మార్క్‌ఫెడ్.
– నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎంఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరుతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
– ఉచితంగా భవనాలు, 100 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఏర్పాటు.
– ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022–27లో భాగంగా పలు ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం.
– ఏపీ లాజిస్టిక్స్‌పాలసీ 2022–27లో భాగంగా పలు ప్రోత్సహకాలకు కేబినెట్ ఆమోదం.
– నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో బయోఇథనాల్ ప్లాంట్‌పెట్టనున్న క్రిబ్‌కో. వ్యాపార కార్యకలాపాల్లో మార్పులు కారణంగా ఎరువులకు బదులు బయోఇథనాల్ ఉత్పత్తి చేస్తామన్న క్రిబ్‌కోకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.
– ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో 16 అదనపు పోస్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.
– రాష్ట్రంలో ఆరోగ్యరంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలకు కేబినెట్ ఆమోదం.
– కోవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా పటిష్ట చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.
– ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా... మెడికల్ హబ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
–ఒకవైపు పీహెచ్‌సీల నుంచి సీహెచ్‌సీల వరకు నాడు నేడు కింద ఇప్పటికే అభివద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం.
– 16 కొత్త మెడికల్ కళాశాలలు నిర్మాణంతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద అభివృద్ది పనులు.
మరోవైపు ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీల్లో కూడా నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం.
వీటికి అదనంగా మెడికల్ హబ్స్ ఏర్పాటుకు నిర్ణయం.
– అత్యాధునిక వైద్యంకోసం రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు.
– ఈ హబ్స్ కింద ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
– మచిలీపట్నంలో అత్యాధునిక వైద్యసదుపాయాలతో నిర్మించనున్న ఆస్పత్రికోసం ఎకరా భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం.
– ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికోసం 3ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం.
– నెల్లూరు రూరల్‌మండలం కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రి 4 ఎకరాల
భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
– వైయస్సార్ కడప జిల్లా చిన్నమాచిపల్లిలో 3 ఎకరాల్లో మెడికల్ హబ్‌కింద ఏర్పాటుకానున్న ఆస్పత్రికి భూమి కేటాయింపు.
– సూళ్లూరుపేట మండలం మన్నార్‌పోలూరు, పడమటికండ్రిగ గ్రామాల్లో 11.19 ఎకరాల భూమి టెక్స్‌టైల్ పార్క్‌కు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
– పెనుగొండ డివిజన్ మడకశిర మండలం ఆర్. అనంతపురంలో 235 ఎకరాలు ఇండస్ట్రియల్‌పార్క్ కోసం ఏపీఐఐసీకి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
– ఇదే గ్రామంలో మరో 63.16 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయింపు.
– మడకశిర మండలంలోని గౌడనహళ్లిలో 318.14 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు.
– ఇదే గ్రామంలో 192.08 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు.
– ఇక్కడ ఫుడ్‌ప్రాససింగ్, పశుసంవర్థక, మినరల్స్ మరియు టెక్స్‌టైల్స్ పరిశ్రమలు ఏర్పాటు. కేబినెట్ ఆమోదం.
– పెనుగొండలో మెగా స్పిరిట్యువల్ సెంటర్, టూరిస్ట్ బేస్‌క్యాంప్‌కు 40.04 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
– తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీకి 41.77 ఎకరాలు కేటాయింపు. కేబినెట్ ఆమోదం.
– అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిస్టార్ట్‌కు 10.50 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
– కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో ఏపీటీడీసీకి 56 ఎకరాలు కేటాయింపు. ఇక్కడ రిసార్ట్‌కట్టనున్న ఏపీటీడీసీ.
– విశాఖపట్నం జిల్లాలో ఎండాడలో కాపు భవన్ నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
– బాపట్ల జిల్లా అద్దంకిలో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్ నిర్మాణాలకు 19 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
– నంద్యాలజిల్లా ప్యాపిలిలో హార్టీకల్చర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కాంప్లెక్స్‌కోసం 25.93 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
– బాపట్ల జిల్లాలో రేపల్లె కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ఆమేరకు సవరించిన సరిహద్దులకు కేబినెట్ ఆమోదం.
పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో నర్సపూర్ అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు ఇచ్చిన 1754.49 ఎకరాల భూమిని ప.గో.జిల్లా కలెక్టర్‌కు ఇచ్చి, తిరిగి ప్రస్తుతం ఆభూమిని అనుభవిస్తున్న లీజుదారులకు ఎకరా కేవలం రూ. 100 చొప్పున పూర్తి హక్కులతో ఇచ్చే జీవోకు కేబినెట్ ఆమోదం.
– దాదాపు వేయిమందికిపైగా రైతులకు లబ్ధి.
– పాస్టర్లకు గౌరవవేతనం ఇస్తూ గతంలో జారీచేసిన జీవో సవరణకు కేబినెట్ ఆమోదం.
– జిల్లా కేంద్రాల్లో వైయస్సార్‌సీపీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
– గత ప్రభుత్వం హయాంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తూ జారీచేసిన జీవో ప్రకారమే స్థలాల కేటాయింపు చేస్తున్నామన్న రాష్ట్ర మంత్రివర్గం.
Comments