పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, ఈరోజు సాయంత్రం పెదగంట్యాడ జంక్షన్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి మాట్లాడాతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం తర్వాతే విశాఖపట్నం మహా పట్టణంగా అభివృద్ధి అయిందని, ఈ గాజువాక ప్రాంతం రాష్ట్ర తలసరి ఆదాయం లో నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు.ప్రాణ త్యాగాల తో నిర్మించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలు అందరిపైనా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న కోటి సంతకాల మహోద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకులు నమ్మి రమణ అధ్యక్షత వహించగా మసేను రావు,కె అప్పలరాజు పాల అప్పల రెడ్డి,పిట్ట రెడ్డి కొండ శ్రీనివాస్ రెడ్డి, ఎల్లేటి శ్రీనివాస్, డి పరదేశ్ , గొందేసి పెంటయ్య రెడ్డి పాల వెంకయ్య, సి.హెచ్ రాముడు, సింహాచలం, ఆనంద్ ,సురేష్ ,తదితరులు పాల్గొన్నారు
top of page
bottom of page
Comments