ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై డిసెంబర్ 9 నుంచి 13 వరకు కన్యతీర్థం నుండి కడప కలెక్టరేట్ వర్కు జరిగే సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి రామయ్య, ప్రముఖ న్యాయవాది కథా రచయిత దాదా హయత్ లు గోడపత్రాలను స్థానిక గాంధీ రోడ్ నందలి గాంధీ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు కాటకాలతో అల్లాడుతున్న, పాలకుల పూర్తి నిర్లక్ష్యానికి గురైన కడప జిల్లా అభివృద్ధి కోసం ఏ ఒక్క పరిశ్రమ లేదని నాడు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి జిల్లాలో శంకుస్థాపన చేశారని, అయితే ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చి మూడు శిలాఫలకాలు వేసి 11 ఏళ్లు గడిచిన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కూడా మొదలు కాలేదని, ఫలితంగా ఇక్కడి నిరుద్యోగ యువత బయటి దేశాలకు, రాష్ట్రాలకు ఉపాధికై వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 నుండి పోరాటాలు చేపట్టామని, వైఎస్ఆర్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కన్ని తీర్థం వద్ద శంకుస్థాపన చేయగా, జగన్ మూడేళ్లయిన మూడు పైసలు కూడా నిధులు మంజూరు చేయకపోగా, వక్ర దృష్టి చూస్తున్నాడని ఈ దశలో సిపిఐ మలిదశ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కలుపుకొని ఈ నెల 9 నుంచి పాదయాత్రలు చేపడుతున్నదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్లో ఐదు వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సాగే పాదయాత్రకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, కేరళ సిపిఐ ఎంపీ బినయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు, జి ఈశ్వరయ్యలు పాదయాత్ర చేపడుతు ఈనెల 10న ప్రొద్దుటూరుకు పాదయాత్ర చేరుకుంటుందని, కావున అన్ని వర్గాల ప్రజానీకం, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వై హరి, శివారెడ్డి, పట్టణ సహాయ కార్యదర్శి షరీఫ్, సమితి సభ్యులు రామకృష్ణ, మచ్చా శీను,ప్రతాప్, శ్రీనివాసులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
Comments