వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
కొత్తపల్లె పంచాయతీలో గత నాలుగు రోజులుగా పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మెను నేటి మధ్యాహ్నం నుండి విరమించి విధులలోకి చేరారు, జమ్మలమడుగు డివిజనల్ పంచాయతి అధికారి జి. విజయ్ భాస్కర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి. పరమేశ్వర్ రెడ్డి నేడు పంచాయతీ పరిధిలోని పారిశుధ్య కార్మికులతో సమగ్రంగా చేర్చించి వారిని విధుల నుండి తొలగించలేదని, పై అధికారుల ఆదేశాల మేరకు తిరిగి విధులలో హాజరు కావాలని సూచించి వారిని ఒప్పించారు. పంచాయతీ పరిధిలోని అరవై రెండు మంది పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పంచాయతిలోని పలు వార్డులలో సమ్మె కారణంగా అపరిశుబ్రత బాగా పెరిగిందని, తక్షణం సమ్మె విరమించి తిరిగి విధులకు హాజరవ్వాలని కోరారు. గ్రీన్ అంబాసిడర్ తో మాట్లాడి తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాబోవు రోజుల్లో కార్మికుల జీతాలు ఆరు వేల రూపాయల నుండి పది వేలకు పెంచే ప్రతిపాదనను పారిశుధ్య కార్మికురాలు సుధా ప్రస్తావించగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. గత ఎనిమిది నెలలుగా కార్మికుల జీతాల బకాయిలు చెల్లింపులో అవాంతరాలు ఏర్పడ్డాయని, అయిదు నెలల జీతాలు ఇప్పటికి చెల్లించామని, మిగులు మూడు నెలల జీతాలు పంచాయతి సెక్రటరీ నరసింహులుతో చేర్చించి త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంతరం సమ్మె విరమించి తిరిగి విధులకు హాజరవుతున్న కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలియచేసారు.
సిపిఐ నాయకుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ, తమ కార్మికులను తిరిగి విధులలోకి తీసుకున్నందుకు డివిజనల్ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు రోజుల్లో మరలా ఇలాంటి ప్రస్తావన వస్తే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. పారిశుధ్య కార్మికులకు అందాల్సిన సబ్బులు, నూనె, చేతి గ్లౌజులు, జీతాలు సకాలంలో అందివ్వాలని ఆయన కోరారు.
Comments