విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యేలను అడ్డుకోండి - టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న వైకాపా ఎమ్మెల్యేలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు శనివారం నందలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యాసంవ త్సరం మొదలై నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు చదువు పూర్తయిన విద్యార్థులకు మార్కులలిస్టులు, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. పై చదువులు, ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వ్యూలకి హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు . కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి తల్లి జాయింట్ అకౌంట్ ఇవ్వమని అడగడం చాలా దారుణం అన్నారు ఎందుకంటే విద్యార్థులు ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల్లో చదువుకుంటూ ఉంటారు వారు వచ్చి కొత్తగా అకౌంట్ తీసుకోవడం అంటే ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను కాజేయడానికే ఈ జాయింట్ అకౌంట్ డ్రామా ఆడుతున్నారని అన్నారు ఎటువంటి షరతులు లేకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కోన శివప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments