విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి తెలియజేశారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ఎస్ రోడ్డులో గల శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రైల్వే లోకో పైలట్ బి.రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వలన శాస్త్ర పురోభివృద్ధిలో ప్రపంచ దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించిన అనేక శాస్త్రీయ నమూనాలను ప్రదర్శించారు. ఉత్తమ పరిశోధన నమూనాలకు విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం రమణయ్య, వైస్ ప్రిన్సిపల్ అనూష, అకడమిక్ డీన్ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్ ఇన్చార్జి శ్రీనివాసులు, ప్రైమరీ ఇన్చార్జి కస్తూరి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments