విద్యార్థులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :
విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవలో కూడా భాగస్వామ్యం కావాలని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పోలా రమణారెడ్డి, ఊటుకూరు ఎంపీటీసీ నాగ చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పోలా రమణారెడ్డి దత్తత గ్రామమైన ఊటుకూరు పంచాయతీ పరిధిలోని కొండ్లో పల్లెలో వారం రోజులు పాటు నిర్వహించే ప్రత్యేక క్యాంపును పోలా రమణారెడ్డి, ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య నాయుడు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం కొండ్లోపల్లె లో ర్యాలీ నిర్వహించి ఎం.పీ.యు.పి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలా రమణారెడ్డి, నాగ చంద్రశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ వైష్ణవి డిగ్రీ కళాశాల విద్యార్థులు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 8 వరకు తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతులు రావడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత సమస్యను పరిష్కరించాలని రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వైష్ణవి కళాశాల ఎన్ ఎస్ ఎస్ పి.ఓ నాగరాజు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంపులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లచే కొండ్లోపల్లి గ్రామంలో వారం రోజులు పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ చౌడవరం నరసింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Commentaires