వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి నాయకులు, రాష్ట్ర ఎమ్మార్పీఎస్ కన్వీనర్ అమ్ములదిన్నె సుధాకర్ మాదిగ, కడప జిల్లా అధికార ప్రతినిధి పగిడాల దస్తగిరి శనివారం ఉదయం సంయుక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధాకర్ మాదిగ మాట్లాడుతూ, గత కొద్ది రోజుల కిందట ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి, క్రింది కోర్టులో బెయిల్ మంజూరు అవ్వనందున, హైకోర్టుకు వెళ్లి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా వాజ్పేయి నగర్ ఆక్రమణదారులకు కూడా హైకోర్టు ఆక్రమిత స్థలాన్ని ఖాళీ చేయమని ఉత్తర్వులు జారీ చేసిందని, తధానుగుణంగా ప్రభుత్వ అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు వాజ్పేయి నగర్ కాళీ చేయించారని, హైకోర్టు ఉత్తర్వులను ఆదేశాలలో పొందుపరచిన షరతులను ఎలా గౌరవిస్తూ టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోకి అడుగిడలేదో, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి ఆక్రమణదారులను ఇల్లు ఖాళీ చేయిచారని అన్నారు.
అనంతరం పగిడాల దస్తగిరి మాట్లాడుతూ, వాజ్పేయి నగర్ ను ఖాళీ చేయించే విషయంలో నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఎటువంటి ప్రమేయం లేదని, యజమానులు హైకోర్టు ఆశ్రయించి న్యాయం పొందారని అన్నారు. కడప జిల్లాలో దాదాపు లక్ష ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలవాలనే తలంపుతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పని చేస్తున్నారని ఆయన వెల్లడించారు.కార్యక్రమంలో రాష్ట్ర ఎంఆర్పిఎస్ కన్వీనర్ అమ్ములుదిన్నె సుధాకర్ మాదిగ, కడప జిల్లా అధికార ప్రతినిధి పగడాల దస్తగిరి, కడప జిల్లా ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్లగట్ల కొండయ్య పాల్గొన్నారు.
Comments