చిట్వేలి ఆసుపత్రికి షుగర్ మందుల కొరత.
-- ఇబ్బందులు పడుతున్న షుగర్ వ్యాధిగ్రస్తులు.
ప్రభుత్వం ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నప్పటికీ అమలు చేయడంలో అధికారుల లోపంతో పలు విమర్శలు వినపడుతున్నాయి. గత నెల రోజులుగా చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో షుగర్ వ్యాధికి ఉపయోగించే "గ్లిమిప్రైడ్ 1 మిల్లీ గ్రాము" మాత్రలు లేక పోవడంతో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు.అయితే వ్యాధిగ్రస్తులు మందులు తప్పనిసరి వాడాల్సి ఉండడంతో బయట అధిక నగదును వెచ్చించి కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. బయట మండలాలలో ఈ మందు లభ్యత ఉండడం చిట్వేలి లో మాత్రం లేకపోవడం వైద్యుల అలసత్వానికి నిదర్శనమని బాధితులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువమంది పేదవారేనన్న విషయాన్ని గుర్తించి కొరతగా ఉన్న ఈ షుగర్ వ్యాధి మందును సత్వరమే తెప్పించాలని బాధితులు కోరుతున్నారు.
బాధితుడు కోడూరు రవి మాట్లాడుతూ...
. గత రెండు నెలలుగా షుగర్ మందుల కోసం ప్రతి రోజు ఆస్పత్రికి వెళుతూ ఉన్న మందులు రాలేదన్న సమాధానం తప్ప ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంముదని అన్నారు.
వైద్యులు డాక్టర్ అన్సారి వివరణ... జిల్లా స్టాక్ పాయింట్ నుంచి సదరమందు సప్లై లేదని ఫలితంగా బాధితులకు అందించలేకపోతున్నామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని అన్నారు.
Comments