వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో వివాహిత అనుమానాస్పద మృతి, ప్రభుత్వాలు పోలీసు శాఖ మహిళా చట్టాలు, గృహహింసలపై అవగాహన కల్పిస్తూ మహిళలకు 'దిశా' యాప్ 24 గంటలు SOS ద్వారా ఏదయినా అనుమానాస్పద లేక అవాంఛనీయ సంఘటనలు వారికి జరగబోతుందన్న అనుమానం ఉన్నా సంబంధిత పోలీసులను ఆశ్రయించే వెసలుబాటు కలిపించింది. కాగా చదువుకున్న మహిళలు లేదా మొబైల్ వాడకం పట్ల అవగాహన ఉన్న వారు యాప్ ను వాడుతుండగా కొందరు అవగాహనా రాహిత్యం లేదా వారి ఆర్ధిక స్థితిగతుల వలన ఈ యాప్ వాడటం లేదు. కాగా ప్రభుత్వం ప్రతి సచివాలయానికి ఒక మహిళా పోలీసును కూడా ఏర్పాటు చేసింది, వారిని అయినా సంప్రదించవచ్చు.
వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు రురల్ పోలీసు స్టేషన్ పరిధిలోని జమ్మలమడుగు బైపాస్ లోని మునిసిపాలిటీ డంప్ యార్డ్ వద్ద గల ధనియాల మిల్లులో పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్న మాబుణ్ణి (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో అర్ధరాత్రి ఉరి వేసుకొని మృతి, భర్త దస్తగిరి ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. భార్యతో దస్తగిరి తరచూ మద్యం సేవించి గొడవ పడేవాడని, ఇది ఆత్మహత్య కాదని మద్యానికి బానిసయిన భర్త దస్తగిరి మద్యం మత్తులో భార్య మాబుణ్ణి తో గొడవ పడి ఉరి వేసి ఉంటాడు అని బంధువులు ఆరోపిస్తున్నారు. పరారీలో భర్త దస్తిగిరి ఉండటం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. సంఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్న రూరల్ ఎస్.ఐ సంజీవరెడ్డి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comentarios