వేసవి విజ్ఞాన శిబిరం పై అవగాహన ర్యాలీ గ్రంథాలయం విద్యార్థులకు బహు ప్రయోజనం. చిట్వేలు గ్రంధాలయ అధికారి శ్రీనివాసులు.
స్థానిక చిట్వేలి గ్రంథాలయ శాఖ రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి చిట్వేలి శాఖ గ్రంధాలయం భవనం వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి వారికి అవగాహన సదస్సును నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్ ప్రసాద్, ఆంగ్ల ఉపాధ్యాయులు పసుపుల రాజశేఖర్ లు గ్రంథాలయ ఆవశ్యకత గురించి,పుస్తక పఠనం గురించి విద్యార్థులందరికీ అవగాహన కల్పిస్తూ ప్రస్తుతం గ్రంథాలయశాఖ అధికారులు నిర్వహిస్తున్న ఈ వేసవి విజ్ఞాన శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ శిబిరాన్ని మే 17వ తేదీ నుంచి జూన్ 30 వరకు నిర్వహిస్తామని గ్రంథాలయ నిర్వాహకులు శ్రీనివాసులు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ చంద్రశేఖర్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments