స్మశానంలో కంపచెట్లు వ్యర్ధాల తొలగింపు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గడచిన 40 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ సుందరయ్య కాలనీ నందు రెండు ఎకరాల విస్తీర్ణంలో గల స్మశాన వాటిక ఎటువంటి మౌలిక వసతులు అభివృద్ధి పనులకు నోచుకోలేదని, జమ్ము, కంప చెట్లు పెరిగి ఇక్కడి స్మశాన వాటిక అడవిని తలపించే విధంగా ఉండటంతో, స్థానిక సుందరయ్య కాలనీ వాసులు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి విషయం తెలియజేశారు. పంచాయతీ నిధుల ద్వారా సర్పంచ్ కొనిరెడ్డి ఇక్కడి వ్యర్ధాలను, కంప చెట్లను తొలగిస్తూ, మట్టి వేసి స్మశాన వాటిక భూమి ఎత్తు పెంచటం వలన వర్షాకాలంలో ఇక్కడికి వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోవడం పట్ల స్థానిక సుందరయ్య కాలనీవాసులు ఆయనకు గురువారం ఉదయం కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments