బిజెపి జాతీయ కార్యదర్శి సత్య ఆధ్వర్యంలో బిజెపిలో చేరికలు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
సుందరయ్య కాలనీ వాసులు దాదాపు 300 మంది గురువారం ఉదయం బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ గొర్రె శీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సత్య కుమార్ సుందరయ్య నగర్ వాసులకు బిజెపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ సుందరయ్య కాలనీ వాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విశ్వసించి నియోజకవర్గం కన్వీనర్ గొర్రె శీను ఆధ్వర్యంలో పార్టీలో చేరినందుకు వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని, ప్రత్యేకించి ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులు సంచార జాతుల ప్రజల భూములు కూడా ఆక్రమించడం క్షమించరాన్ని నేరమని ఆయన అన్నారు.
బిజెపి అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తోందని, సమాజంలో పేదరికం వలన వలస జీవుల స్థితిగతుల్లో మార్పు రావటం లేదని అందుకు పేదరికమే ముఖ్య కారణమని, పేదరికాన్ని జాతి వివక్షను ఎదుర్కొన్న ప్రధాని మోదీ, దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల గృహాలు పేదలకు మంజూరు చేశారని, అలాగే సంచార జాతులకు చట్టబద్ధత కల్పించి, నీతి ఆయోగ్ ద్వారా సర్వే నిర్వహించి రాష్ట్రాల వారీగా ఆ జాతుల గుర్తింపు, ప్రభుత్వ పథకాల అమలు అయ్యే విధంగా మోదీ చర్యలు తీసుకున్నారన్నారు. ఏపీకి 25 లక్షల ఇళ్లలు మంజూరవగా ఇప్పటికి గడచిన నాలుగున్నర సంవత్సరాల వైసిపి పాలనలో మూడు లక్షల 50 వేల ఇల్లు మాత్రమే నిర్మించారని ఆయన అన్నారు. అసైన్డ్ భూములను దోచుకుంటున్న వైసీపీ పెద్దలకు పేదల ఇల్లు పట్టవా! పేదల జీవితాల్లో మార్పు రావాలి అంటే దేశ ప్రగతికి బాటలు వేయాలనీ అందుకు జాతీయ స్థాయిలో బిజెపి మరో మారు జెండా ఎగురవేయాలని ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ప్రొద్దుటూరు కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు ఆర్ గోపి శ్రీనివాస్, సంచార జాతుల రాష్ట్ర కన్వీనర్ అరబోలు చంద్రశేఖర్, మహిళా మోర్చా ట్రెజరర్ సివి జయలక్ష్మి, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ప్రభు కుమార్, ప్రొద్దుటూరు మండలం అధ్యక్షులు కొర్రపాటి కంబగిరి, రాజుపాలెం మండలాధ్యక్షుడు గోపు లక్ష్మీనరసింహులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.
Comments