దొంగతనాల నిర్మూలనకు దోహదపడాలి - ఎస్ ఐ అబ్దుల్ జహీర్
నందలూరు మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలో వరుసగా జరుగుతున్న దొంగతనాల పై సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ జహీర్ కమిటీ సభ్యులకు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల్లో ప్రతిరోజు వసూలయ్యే మొత్తము సాయంత్రం హుండీల నుండి తీసివేసి దేవాదాయ అకౌంట్ ఓపెన్ చేసి అందులో జమ చేసుకుంటే భద్రత ఉంటుందని అన్నారు. అలాగే దేవతామూర్తుల ఆభరణాలు ఉదయం అలంకరించి సాయంకాలం తీసివేసి భద్రపరిస్తే బాగుంటుందని అలాగే దేవాలయాల పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని వీలు కానిపక్షంలో ఆలయ రక్షణ కోసం ఇద్దరు మనుషులు ఆలయంలోనే బస చేయాలని ఆయన తెలిపారు. దేవతామూర్తుల ఆభరణాలు ఉదయం అలంకరించి సాయంత్రం తీసివేసి జాగ్రత్తపరచాలని ఆయన తెలిపారు పోలీస్ వారు రాత్రిపూట టికెటింగ్ నిర్వహిస్తున్నారని ఆ సమయంలో ఎటువంటి దొంగతనాలు జరగలేదని, పోలీసులు వెళ్లిన తర్వాత కాపు గాసి దొంగతనం జరుగుతుందని దానిపై ఆలయ కమిటీ సభ్యులు కూడా తమకు మద్దతు ఇవ్వాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన దేవాదాయ కమిటీ సభ్యులు, మహిళా కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హాజరయ్యారు.
Comments