చెర్లోపల్లి గ్రామంలో స్వచ్ఛ శ్రమదానం.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు చిట్వేలు మండలం చెర్లోపల్లి గ్రామంలో సర్పంచ్ ఓబినేని ఈశ్వరయ్య అధ్యక్షతన, గ్రామ కార్యదర్శి కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ ప్రజలు మూకుమ్మడిగా స్వచ్ఛ శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు.
ఉదయం 10 గంటల మొదలుకొని 11 గంటల వరకు ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్, శ్రీ పరదేశి స్వామి ఆలయ ప్రాంగణాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యదర్శి కేశవరెడ్డి పచ్చదనం పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు, గ్రామస్తులకు వివరించారు. పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల గ్రామస్తులు కేశవరెడ్డిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షులు యన్నారు కిషోర్ కుమార్, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, పాఠశాల పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comentarios