ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించం: తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే ఉపేక్షించమని రాజంపేట తాసిల్దార్ యం.సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ పిఎస్ గిరిష ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులు నాటడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మదన గోపాలపురం గ్రామపంచాయతీలోని ఇసుకపల్లిలో గతంలో పేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే కొందరు పేదలకు మంజూరు చేసిన స్థలాలను ఆక్రమించుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్లు బాధితుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా అనుమతి లేకుండా చెరువుల్లో నుండి మట్టి తవ్వకాలు చేపట్టరాదన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినా, చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
Comments