విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
నందలూరు: విభిన్న ప్రతిభావంతులను (వికలాంగులను) ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తే వారు ఏ రంగంలోనైనా రాణించగలరని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఇసుకపల్లె ప్రాథమిక పాఠశాలలోని భవితా కేంద్రంలో ఎస్ టి ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సమ్మిళిత ఉపాధ్యాయులు రంగస్వామి, వసుంధర దేవి ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు నాగయ్య, అనంత కృష్ణ మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ పిల్లలకు ట్రై సైకిల్, వినికిడి యంత్రాలు , వీల్ చైర్లు లాంటి ఉపకారణాలు, రవాణా, స్టైఫండ్ లాంటి ఉపకార వేతనాలు ఉచితంగా ఉచితంగా అందించడం జరుగుతుందని వీటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని కోరారు. రాజంపేట వికలాంగుల సంఘం అధ్యక్షులు అబ్దుల్లా మాట్లాడుతూ నేడు వికలాంగులకు చదువులోనూ, ఉద్యోగాల లోను నాలుగు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం కల్పిస్తున్నదని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నందలూరు కు చెందిన జాతీయ స్థాయి క్రికెటర్ శివకోటి మాట్లాడుతూ వికలాంగులని హేళన చేయకుండా ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణించ గలరని అన్నారు. ఎస్ టి ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా పోటీల్లో, చిత్రలేఖనం, ఆటల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క దివ్యాంగ పిల్లలకు బహుమతులు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లీలా కృష్ణ, ఉపాధ్యాయులు పుల్లయ్య, లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా బీసీ నాయకులు హిమగిరినాథ్ యాదవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comentarios