వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు లో నేడు టీడీపీ ఆధ్వర్యంలో ఆర్.టీ.సి డిపో ప్రాంగణంలో పెరిగిన ఆర్.టీ.సి చార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఒక్క అవకాశం అని ప్రజలను అడిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ధరలన్ని తగ్గించేస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి నేడు నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ఇప్పుడు RTC బస్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిస్తుందన్నారు. చార్జీల పెంపు నిరసనగా నేడు స్థానిక RTC బస్టాండ్ ఆవరణలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. భారతదేశంలో చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అందరు వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని అన్నారు.
Comentários