(ప్రసన్న ఆంధ్ర, రవి కుమార్, ఏలూరు)
ఏలూరు, రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, సామాన్యులు పడుతున్న కష్టాలను ఎలుగెత్తి చాటిన పొదుపు సంఘాల మహిళల ఆవేదనను చూసైనా సి.ఎం జగన్ బుద్ది తెచ్చుకోవాలని ఏలూరు నియాజక వర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి చంటి ఎద్దేవా చేసారు.
మే డే స్పూర్తితో రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలనకు ముగింపు పలికేందుకు ప్రతిఒక్కరు నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు, విద్యుత్ కోతలకు నిరసనగా టి.డి.పి చేపట్టిన బాదుడే..బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక 13వ డివిజన్ పరిధిలోని మరడాని రంగారావు కాలనీ నుండి బడేటి చంటి ఆధ్వర్యంలో టి.డి.పి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి విసినికర్రలు, కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా కర్నూలు జిల్లా గుడూరులో రాష్ట్రంలో పన్నుల బాదుడు, యితర సమస్యలపై వై.సి.పి ఎం.ఎల్.ఏ ను నిలదీసిన పొదుపు సంఘము మహిళలు అందరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన స
Comentarios