వెళ్ళాల గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం
కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాజుపాలెం మండలం వెళ్ళాల గ్రామంలోని శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, టీటీడీ కల్యాణ మండపం నందు నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి. ఈ సందర్భంగా వరద మాట్లాడుతూ, 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నాడు అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించి పట్టంకట్టారని, నాటి నుండి నేటి వరకు బీసీలు టిడిపి కి అండగా నిలుస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిధిలో దాదాపు 85వేల బీసీల ఓట్లు గలవని, మే 13వ తేదిన జరుగు ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన తనను, కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చడిపిరాళ్ళ భూపేశ్ రెడ్డి నీ బీసీలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనంతరం బిజెపి నాయకుడు గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ, బీసీల పై అణచివేత ధోరణితో వైసిపి ప్రభుత్వం అవలభించిన తీరును గుర్తు చేస్తూ, నియోజకవర్గంలో కూడా బీసీలకు తగు రాజకీయ గుర్తింపు గౌరవం లేదని, 54 బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన జగన్ సర్కార్ వారిని రాజకీయ లబ్ధికి వినియోగించుకుందే తప్ప కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించలేదన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ట్రాక్టర్ లకు ఇచ్చిన నిధులు వైసిపి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, ఎంఎల్ఏ రాచమల్లు అబద్దాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడని, మరోసారి బీసీలు రాచమల్లు చేతిలో మోసపోవటానికి సిద్ధంగా లేరని అన్నారు. ప్రశాంతమైన ప్రొద్దుటూరు కావాలంటే ఈ ఎన్నికలలో వరదను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.
అనంతరం రాజుపాలెం మాజీ జెడ్పిటిసి వెళ్లాల భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథంలో టిడిపి సూపర్ సిక్స్ పథకాలను వెళ్లాల, కుమ్మర పల్లె, గోపల్లె గ్రామ ప్రజలకు వివరిస్తూ టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి, బిజెపి నాయకులు గొర్రె శ్రీనివాసులు, జనసేన నాయకులు, పలువురు రాజుపాలెం మండలం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంగరాజు, చిన్న శెట్టిపల్లె మాజీ సర్పంచ్ ప్రతాప్ యాదవ్, మాజీ జెడ్పిటిసి వెల్లాల భాస్కర్, సోమపురం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేమనారాయణ, స్టేట్ బీసీ సెల్ సెక్రెటరీ తాటి శ్రీనివాసులు యాదవ్, దేవగుడి గోపాల్ రెడ్డి, పలువురు బీసీ నాయకులు, రాజుపాలెం మండల బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Commentaires