రామేశ్వరం 28 వ వార్డులో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం.
కడప జిల్లా, ప్రొద్దుటూరు
టిడిపి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక మున్సిపల్ 7వ, 28వ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్లేటి చంద్రమోహన్ రెడ్డి, పల్లెలు బాబుల్ రెడ్డి, పల్లెటి జగన్ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో 28వ వార్డు నందు నిర్వహించిన ప్రచారంలో ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని, టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను వార్డులోని ప్రజలకు వివరించి, కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు ఓట్లు వేసి, వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే వరదరాజులరెడ్డి కి మద్దతుగా మునిసిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఆంద్రకేశరి రోడ్డు నందు ఎన్నికల ప్రచారం చేసిన ఆయన కుటుంబ సభ్యులు మెట్టుపల్లె అనురాధ, అరుణ, నంద్యాల మీనా కోమల్ , శిల్ప రమణి, ఛమేలి వసంత తదితరులు.
కార్యక్రమంలో పలువురు క్రియాశీలక టిడిపి నాయకులు, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వి.ఎస్. ముక్తియార్, ఈ.వి. సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి వెళ్లాల భాస్కర్, యువ నాయకులు బచ్చల ప్రతాప్, బద్వేలు శ్రీనివాసుల రెడ్డి,, చిలకల కృష్ణారెడ్డి, పొట్టు లక్ష్మిరెడ్డి, పగిడాల దస్తగిరి, సాకం నాగేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు షేక్ మునీర్, మహమ్మద్ గౌస్, వంగల నారాయణరెడ్డి, కామిశెట్టి బాబు, వేణు, సానా విజయభాస్కర్ రెడ్డి, సుబ్బిరెడ్డి, రామేశ్వరం రాముడు, బిజెపి నాయకులు కోనేటి కృష్ణప్రదీపరెడ్డి, కోనేటి సందీప్ రెడ్డి, నరేంద్ర, పాతకోట రాఘవేంద్రారెడ్డి, శివ నాగిరెడ్డి, ఎస్ ఆర్ చిన్న, కుమారి, అఖిల, హరికృష్ణ, మల్లికార్జున, జనసేన నాయకులు జిలాన్, గుండ్లూరు వెంకటరమణ, సుబ్బరాయుడు, శంకర్ రెడ్డి, చెన్నయ్య, రాజు కుల్లాయప్ప, పరమేష్, నాగరాజు, TNSF రాజేష్ ఏసన్న, ఏసూబు, ఆనందరావు, పెయింటర్ మత్తయ్య స్థానిక నాయకులు చీమల రాజశేఖర్ రెడ్డి, మహిళా నాయకురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ క్రియాశీలక కార్యకర్తలు, వార్డులోని ప్రజలు పాల్గొన్నారు.
Comments