కూటమి అభ్యర్థులను గెలిపించి మైనారిటీ హక్కులను పరిరక్షించుకుందాం - మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదని, కూటమిలో భాగంగా మేనిఫెస్టోను రూపొందించి కూటమి పార్టీలన్నీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నాయని సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనగా పౌరసత్వ సవరణ చట్టం లో కూడా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకున్నట్లు మాజీ వైసీపీ ఎమ్మెల్సీ టిడిపి నాయకులు ఇగ్బాల్ అన్నారు.
ప్రొద్దుటూరు కి విచ్చేసిన ఆయన స్థానిక టిడిపి నాయకులు వియెస్ ముక్తియార్ నివాసం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్.ఆర్.సి అనేది బిజెపి మేనిఫెస్టో లోనే లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్సి పై లేని పోనీ రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. సిఏఏ చట్టానికి తాము వ్యతిరేకమైనప్పటికీ, ఉమ్మడి పౌరసత్వానికి వీలైతే అమలు చేస్తామని మాత్రమే మోడీ చెప్పారని గుర్తు చేశారు. ఈ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు 140 నుండి 150 ఎమ్మెల్యే సీట్ల సాధించి అధికారంలోకి రానున్నట్లు జోస్యం చెప్పారు. ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని అందుకు ఉదాహరణలుగా దుల్హన్ పథకానికి ఒక రూపాయి కూడా జగన్ ప్రభుత్వం వెచ్చించలేదని, లేనిపోని నిబంధనలను విధించి ముస్లింలకు అన్యాయం చేశారని, విదేశీ విద్యకు కూడా వైసిపి ప్రభుత్వం మంగళం పాడిందని, హామీలు తప్ప అమలుకు నోచుకోలేని పథకాలను సృష్టించి మైనారిటీలను మోసం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం క్రింద మైనారిటీ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు కూడా తన అవసరానికి రాష్ట్ర ప్రభుత్వం వాడుతుందని, ప్రత్యేకించి ప్రొద్దుటూరులోని మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, వక్స్ బోర్డ్ ఆస్తులకు వైసీపీ ప్రభుత్వ హయాంలో రక్షణ కరువైందని అన్నారు. కావున ఈ ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థులైన కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిని అలాగే ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిని గెలిపించుకొని మైనారిటీల హక్కుల కొరకు అటు పార్లమెంటులోనూ ఇటు అసెంబ్లీ లోను గళం వినిపించేలా మైనారిటీలు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు క్రియాశీలక టిడిపి నాయకులు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు
Comments