top of page
Writer's picturePRASANNA ANDHRA

సామాజిక న్యాయాన్ని గొంతు కోసే యాత్ర - టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి

సామాజిక న్యాయాన్ని గొంతు కోసే యాత్ర

- టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సుయాత్ర సామాజిక న్యాయాన్ని గొంతు కోసే యాత్రని, పొద్దుటూరు నియోజకవర్గం పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మోసం చేసే బస్సు యాత్రగా ఆయన అభివర్ణించారు. శుక్రవారం స్థానిక టీబి రోడ్ లోని తన కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపార్టీ ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎక్కడ పట్టించుకోలేదన్నారు. ఎక్కడ ఓడిపోతామో అని బాబును జైలు కు పంపించి సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టారన్నారు.సీఎం జగన్ ను సూటిగా అడుగుతున్న అంబేద్కర్ ఎస్సీ విద్య ను జగన్ తన పేరు మీద మార్చుకొని,సెక్రటేరియట్ లో దళితులకు ప్రమోషన్స్ ఇవ్వకుండా ద్రోహం చేసి దళితుల కోసం ఈ బస్సు యాత్ర అన్నారు,దుల్హన్ పథకం, ఇస్లామిక్ బ్యాంక్, హజ్ హౌజ్ నిర్మాణాలలో మైనారిటీలకు ద్రోహం చేసినందుక ఈ యాత్ర,బీసీలకు 16800 రాజ్యాంగ పదవులు రాకుండా జగన్ ద్రోహం చేశారన్నారు.డీజీపీ నియామకంలో 5వ స్థానంలో వున్న ద్వారకా తిరుమల రావు ను డీజీపీ చేయక 14 వ స్థానంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ చేశారన్నారు.బీసీ కార్పొరేషన్ ల వల్ల బీసీ లకు వొరిగింది ఏమిటిని, ప్రశ్నించారు.ప్రొద్దుటూరు లో నుసామాజిక సాధికార బస్సుయాత్ర ఎంచుకున్న కారణం ఏమిటి అంటే బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎంఎల్ఏ వల్ల అణచివేతకు గురి అయ్యారన్నారు.వాజపేయి నగర్, సుందరయ్య కాలనీ వాసులే దీనికి నిదర్శనమన్నారు. ఆరో వార్డు దళితులు ఎంఎల్ఏ రాచమల్లు ఇంటి వద్దకు వస్తె క్రింద కూర్చుండబెట్టినందుకా సామాజిక సాధికార బస్సుయాత్ర అన్నారు.బీసీ నేత నందం సుబ్బయ్య ను కిరాతకంగా చంపబడ్డాడు అందుకే నా ప్రొద్దుటూరు లో సామాజిక సాధికార బస్సుయాత్ర,బీసీల భూములు లాక్కున్నందుకా సామాజిక సాధికార బస్సుయాత్ర, మేరువ మూర్తి బీసీ నాయకుడు, అతని తల పగులకొట్టినందుకా సామాజిక సాధికార బస్సుయాత్ర అరాచకాలు ఎంఎల్ఏ చేశాడు కాబట్టే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ల వ్యతిరేకత వుంది కాబట్టే సీఎం ఇక్కడ సామాజిక సాధికార బస్సుయాత్ర మొదటగా చేయమని చెప్పారు.కేవలం ఎన్నికల కోసం జగన్ సామాజిక సాధికార బస్సుయాత్ర ను చేపట్టారన్నారు. ప్రొద్దుటూరు ప్రజలు రాచమల్లు ను మాజీ ఎమ్మెల్యే చేయాలని వున్నారని,ఇది సామాజిక వర్గాల గొంతు కోసే యాత్ర 2024 లో ప్రొద్దుటూరు లో టిడిపి గెలవనుందని, ఎన్ని యాత్రలు చేసినా ప్రయోజనం లేదన్నారు.


54 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page