బెనర్జీ హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి...
ఎమ్మెల్యే రాచమల్లు నుండి ప్రాణహాని ఉంది - నిందితుల కుటుంబ సభ్యుల వెల్లడి...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
సెప్టెంబర్ 25వ తేదీన నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడైన బెనర్జీ పై జరిగిన హత్యాయత్నం దాడి కేసులో ఏ1, ఏ2 లుగా ఉన్న భరత్, రామ్మోహన్ రెడ్డిలను సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చాపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారని. గతంలో బెనర్జీ పలువురిని పలు రకాలుగా దుర్భాషలాడి బెదిరించారని, అలాంటి క్రమంలోనే సెప్టెంబర్ 25వ తేదీన భరత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల మూలంగానే దాడి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, తాము తమ కార్యకర్తలు ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించిన దాఖలాలు లేవని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన కోరారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నిందితులను పత్రికా మూలంగా పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినట్లు, రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్చలేని ఎమ్మెల్యే రాచమల్లు పథకం ప్రకారం తనను కూడా కేసులో ముద్దాయిగా చేర్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను ఎమ్మెల్యే రాచమల్లుకు సవాల్ విసురుతున్నానని నందం సుబ్బయ్య హత్య కేసు, అలాగే బెనర్జీ పై జరిగిన హత్యాయత్నం కేసులను సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే నందం సుబ్బయ్య భార్య అపరాజిత హైకోర్టులో సీబీఐ ఎంక్వయిరీ దాఖలు చేసిందని, అందుకు వైసిపి నాయకులు ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఏ1 గా ఉన్న భరత్ కుమార్ రెడ్డి తల్లి సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, ఆత్మ రక్షణ కోసం తన కొడుకు దాడి చేశారని, ఎమ్మెల్యే రాచమల్లు వలన తమకు తన బిడ్డకు ప్రాణహాని ఉందని అన్నారు. అనంతరం ఎ2 ముద్దాయి రామ్మోహన్ రెడ్డి సతీమణి రాజేశ్వరి మాట్లాడుతూ తన భర్త ఇంటి వద్ద నుండి బ్యాంక్ పనుల నిమిత్తం బయటకు వెళ్లారని, బెనర్జీ భరత్ పెనుగులాట సమయంలో రాము విడిపించే ప్రయత్నం చేశారని పోలీసులు నిజం నిర్ధారణ చేసి తన భర్తకు తగు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నుండి తన భర్తకు ప్రాణహాని ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
Comments